Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీవీ యాంకర్ లోబో పెను ప్రమాదం నుండి బయట పడ్డారు. వివరాల లోకి వెళితే ప్రముఖ యాంకర్ లోబో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నెడిగొండ దగ్గర ఆయన ప్రయాణిస్తున్న వోక్స్ వాగన్ పోలో కారు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో లోబోకు గాయాలు కాగా… కారులో ఉన్న మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఇటు ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. లోబో ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఆటో నుజ్జు నుజ్జు అయింది. పెద్ద, పెద్ద మట్టి కుప్పలు ఉండటంతో కారు వాటికి తగిలి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టు తెలుస్తోంది. లోబో షూటింగ్ కోసం వరంగల్‌తో పాటూ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. లోబో టీవీ ప్రొగ్రామ్స్‌కు యాంకరింగ్ చేశారు. అలాగే కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రలు వేశారు.