Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈ సంవత్సరం ప్రారంభం అయ్యి మూడు నెలలు పూర్తి అయిన తర్వాత ‘రంగస్థలం’ చిత్రంతో టాలీవుడ్‌కు సక్సెస్ దక్కింది. ఇకపై వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ సందడి చేసే సినిమాలు రానున్నాయని అంతా భావించారు. బ్యాక్ టు బ్యాక్ రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య, నేల టికెట్ ఇలా వరుసగా సినిమాలు వేసవి వినోదాన్ని పంచనున్నాయని, తప్పకుండా ఇవి రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తాయని అంతా భావించారు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే స్టార్ హీరోల సినిమాలు కూడా సక్సెస్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్‌ను రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు.
దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సంరంభం ఆరంభం అయ్యింది. గత పది సీజన్‌లు కూడా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీజన్ కూడా క్రికెట్ అభిమానులకు రెండు నెలల పాటు పండుగను తీసుకు రావడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా పెద్దగా కలెక్షన్స్ లేకుండా వెలవెలబోతున్న బాక్సాఫీస్ ఐపీఎల్ వల్ల మరోసారి షాక్ తినాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలో ఐపీఎల్ కారణంగా విడుదల కాబోతున్న చిత్రాల కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భరత్ అనే నేను మరియు నా పేరు సూర్య చిత్రాు ఐపీఎల్ సీజన్‌లోనే రాబోతున్నాయి. మరి ఈ రెండు చిత్రాల కలెక్షన్స్‌పై ఎలాంటి ప్రభావంను ఐపీఎల్ చూపిస్తుందనేది చూడాలి.