Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత వారం ప్రేక్షకుల ముందుకు దాదాపు ఎనిమిది చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ చిత్రాల్లో ఒక్కటి రెండు మినహా మిగిలిన దాదాపు అన్ని సినిమాలు కూడా బొక్క బోర్లా పడ్డాయి. పెద్ద సినిమాలు విడుదల లేకపోవడంతో పాటు, డిసెంబర్ మరియు జనవరిలో చిన్న చిత్రాల విడుదలకు ఛాన్స్ లేదు. వరుసగా పెద్ద చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత పరీక్షల సీజన్ అవ్వడంతో ఫిబ్రవరి, మార్చిలో సినిమాల విడుదల ఉండదు. ఇక ఏప్రిల్‌లో మళ్లీ పెద్ద సినిమాలు వరుసగా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. అంటే చిన్న చిత్రాలు ఇప్పుడు తప్పితే మే లేదా జూన్ వరకు ఎదురు చూడాల్సిందే. అందుకే అప్పటి వరకు వెయిట్ చేయడం ఎందుకని ఈనెలలోనే దాదాపు అన్ని సినిమాలు కూడా విడుదలకు రెడీ అయ్యాయి.
ఈ వారం అంటే ఈనెల 24న ఏకంగా 11 సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ 11 చిత్రాల్లో ఒకటి రెండు చిత్రాలు తప్ప అన్ని కూడా పెద్దగా ప్రేక్షకులకు తెలియని చిత్రాలే. ఈ వారంలో 1. బాలకృష్ణుడు, 2. మెంటల్ మదిలో, 3. హేయ్ పిల్లగాడ, 4. దేవిశ్రీ ప్రసాద్, 5. నెపోలియన్, 6. జూలీ 2, 7. జంద్యాల రాసిన ప్రేమ కథ, 8. ఇప్పట్లో రాముడిగా సితగా ఎవరుంటారండి బాబు, 9. జూన్ 143, 10. బాబీ, 11. కోకో. ఈ 11 చిత్రాల్లో ప్రేక్షకులను కనీసం మూడు నాలుగు చిత్రాలు అయినా ఆకట్టుకుంటాయా అనేది చూడాలి. మొదటి మూడు సినిమాలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. మిగిలిన చిత్రాల గురించి ప్రేక్షకులు కనీసం పట్టించుకోవడం లేదు. ఒకవేళ టాక్ పాజిటివ్‌గా వస్తే అప్పుడు ప్రేక్షకులు ఆసినిమాల వైపు ఆకర్షించబడే అవకాశం ఉంది.