పిల్లలకోసం ప్రత్యేక అకౌంట్స్

పిల్లల కోసం ప్రత్యేక అకౌంట్స్

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు పిల్లల పేరుపై ప్రత్యేకంగా సేవింగ్స్ అకౌంట్ సేవలు అందించనున్నాయి. ఈ సేవింగ్స్ అకౌంట్లపై మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్‌బుక్, చెక్‌బుక్, ఏటీఎం వంటి ప్రయోజనాలని కూడా ఇవ్వబోతున్నాయి. పిల్లల పేరుపై ఈ ఖాతాలను తెరవొచ్చు. దీని ద్వార చిన్నప్పటి నుండే బ్యాంక్ సేవలపై అవగాహన కలిపించి మనీ సేవింగ్, పొదుపు వంటి విషయాల గురించి తెలియ జేయవచ్చు.

10ఏళ్ల పైన వయసు పైన ఉన్న పిల్లలకి బ్యాంక్ అకౌంట్లను వారికి వారే నిర్వహించుకోని పర్సనల్ ఫైనాన్స్ అంశాల గురించి కూడా అవగాహన పెంచుకుంటూ బ్యాంక్ డిపాజిట్స్, విత్‌డ్రాయెల్స్, మంత్లీ స్టేట్‌మెంట్ వంటి వాటిని చేసుకుంటారు.

బాలల దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ బ్యాంకు పిల్లల కోసం అందిస్తున్న సేవింగ్స్ అకౌంట్స్ వివరాలు, మైనర్లు ఏవయసులో ఉన్న పిల్లలు “ఎస్‌బీఐ పెహ్లి కడమ్ అండ్ పెహ్లి ఉడాన్” సేవింగ్స్ అకౌంట్‌ను పొందవచ్చు. పిల్లలపై పేరుపై తల్లిదండ్రులు లేదా సంరక్షులతో పాటు పిల్లలపై పేరుపై జాయింట్ అకౌంట్‌ను ప్రారంభించొచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు ఇంకా చెక్‌బుక్ వంటి సేవలు లభిస్తాయి.

అదే విధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా 18 ఏళ్లకు లోపు వారికీ హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌పై అందచేస్తూ డెబిట్ కార్డు అందచేస్తారు. 2500 రూపాలని రోజు గరిష్టంగా పది వేల రూపాలని ఖర్చు పెట్టొచ్చు. ఈ హెచ్‌డీఎఫ్‌సీ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్‌పై ఉచిత ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్ కూడా అందిస్తున్నారు. పాస్‌బుక్, ఫోన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు కూడా అందించనున్నారు. యావరేజ్ బ్యాలెన్స్ నెలకి కనీసం 5000 వేల రూపాయలు ఉండాలి.

ఐసీఐసీఐ బ్యాంక్ కూడా పిల్లల కోసం యంగ్ స్టర్స్ సేవింగ్స్ అకౌంట్ సేవలు తీస్కువస్తుంది. అకౌంట్‌పై డెబిట్ కార్డు ఇస్తూ రోజుకు 2500 వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఇస్తుంది. ఏటీఎం నుంచి 5000 రూపాయల వరకి మాత్రమే డబ్బులు తీసుకోవచ్చు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, పర్చేస్ ప్రొటెక్షన్ కవర్ వంటి సదుపాయలు కూడా ఈ ఖాతా ద్వారా అందిస్తున్నారు.