ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనకు ప్రత్యేక అధికారిణి

ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనకు ప్రత్యేక అధికారిణి

ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును రూపొందించడానికి ప్రాథమిక, ఉన్నత విద్యాశాఖకు చెందిన అధికారులను భాగస్వామ్యులను చేస్తూ ప్రత్యేక అధికారిగా ఆమె నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పని చేస్తున్న యంగ్ ఐఎఎస్ అధికారిణి కే.వెట్రిసెల్విని నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీస్కురానున్న 15 వేలకు పైగా పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను తీస్కు రానుంది. ఇంగ్లీష్ మీడియంలోనే ఒకటో తరగతి నుంచి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండబోతు దీనికి సంబంధించి, పాఠ్య పుస్తకాల ముద్రణ మొదలుకుని వసతుల కల్పన, పాఠశాలలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాల కార్యక్రమాలు అన్నింటినీ ప్రభుత్వం చేపట్టబోతోంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం వంటి కార్యక్రమాలని కూడా ప్రవేశ పెట్టనుంది.

అటు తెలుగు భాషాభిమానుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనను ప్రవేశ పెట్టడంపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.