అలర్జీ వస్తోందా

అలర్జీ వస్తోందా

ఇలా పడని ఆహారం తీసుకున్న వారికి నిమిషాల్లో, గంటలో ఎలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. వళ్ళు కందడం, దురదలు రావడం, గొంతు మండటం జరుగుతాయి. ఇలా ఎలర్జీకి కారణమయ్యే ఆహారాన్ని గుర్తించి వాటికి దూరంగా వుండటం మంచిది.ఫుడ్ అలర్జీకి కారణం కనుక్కోకపోతే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఫుడ్ అలర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు లాంటి చిన్న ఇబ్బందులే కాక శ్వాస సంబంధిత సమస్యల వంటి పెద్ద కష్టాలు కూడా వస్తాయి. పల్లీలు తినడం వల్ల కూడా కొందరికి అలర్జీ వస్తుంది. కొన్ని రకాల ఫుడ్ అలర్జీలు కుటుంబ వారసత్వంగా వస్తాయి.

అందుకే వీటి గురించి కొంచెమైనా తెలుసుకుని ఉండటం మంచిది. తొంభై శాతం ఫుడ్ అలర్జీలు ఎనిమిది రకాల ఆహారపదార్థాల వల్ల వస్తాయి అవేమిటంటే.. పాలు, గుడ్డు పల్లీలు, వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, చేపల్లో కొన్ని రకాల చేపలు.. షేల్ ఫిష్ అంటే పీతలు, రొయ్యలు, సాయ్, ఆహార ధాన్యాల్లో గోధుమలు, రెగ్యులర్‌గా తీసుకునే ఆహారాల వల్ల కూడా ఒక్కోసారి అలర్జీలు వస్తాయి. ఫుడ్ అలర్జీల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది.

విటమిన్ డి అలర్జీలు రాకుండా ఆరోగ్యకరమైన ప్రతిస్పందన అభివృద్ధి చేసుకొనేలా రోగనిరోధక వ్యవస్థకు సహకరిస్తుంది. ప్రపంచ జనాభాలో చాలామందికి తగినంతగా విటమిన్ డి లభించదు. దీనికి పలు కారణాలు. వీటిలో ఒకటి ఎండలో తక్కువ సేపు ఉండడం. అంతే కాదు, ఒక్క దశాబ్దంలో అమెరికాలో విటమిన్ డి లోపం ఉన్నవారి శాతం రెట్టింపైంది.

”డ్యూయల్ అలర్జెన్స్ ఎక్స్‌పోజర్” సిద్ధాంతం కొత్తది. ఇది సమయం, మోతాదు, ఎక్స్ పోజర్ రకాల మధ్య గ్యాప్ లేకపోవడం వల్ల ఆహార అలర్జీ అధికమవుతోందని చెబుతుంది.చిన్నపిల్లలకి ఆరోగ్యకరమైన ఆహారాలు తినిపించడం ద్వారా ఆరోగ్యకరమైన ప్రతిస్పందన వచ్చి, అలర్జీల సమస్య తగ్గుతుంది. ఎందుకంటే పొట్టలోని పేగు బాక్టీరియాను, ఆహారం లాంటి విదేశీ పదార్థాలను సహించడానికి సిద్ధమవుతుంది.

లండన్‌లోని కింగ్స్ కాలేజ్ చేసిన లీప్ స్టడీకి ఇదే మూలాధారం. అయిదేళ్ళ వయసున్న పిల్లలు క్రమం తప్పకుండా ఏడాది వయసునుంచి వేరుసెనగ తింటే, వేరుసెనగ అలర్జీ 80% తగ్గింది.అయితే 2 సంవత్సరాల వయస్సు గలవారిలో 10 శాతం ఈ సమస్య ఉంటుంది. అదే 14 నుండి 17 ఏళ్ల వయసు వారిలో 7 .1 శాతం ఈ సమస్య వుంది. పద్దెనిమిది అంత కంటే తక్కువ వాళ్లలో 10.8 శాతం వుంది.

ఎక్కువగా చిన్న పిల్లలలో పాలు, గుడ్లు, గోధుమలు మరియు సోయా వలన అలర్జీలు తరచుగా వస్తూ ఉంటాయి. అలర్జీలతో బాధపడే వారిలో దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటివి ఉండచ్చు. అయితే అందరికి లక్షణాలు ఒకేలా ఉండదు.కొన్ని కొన్ని సార్లు ఎక్కువ కాలం పాటు ఏమైనా ఆహార పదార్థా

లు తీసుకోకుండా ఒకేసారి తినడం వల్ల కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కొన్ని రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల కూడా ఎలర్జీ వస్తుంది. కొంత మందిలో అయితే స్పెసిఫిక్‌గా ఈ అలర్జీ ఉంటుంది ఉదాహరణకు పచ్చి పల్లీలు తిన్నప్పుడు ఎలర్జీ ఉండొచ్చు. కానీ సాల్ట్ వేసుకుని తినడం వల్ల ఎలర్జీ రాకపోవచ్చు. ఇలా కొందరిలో స్పెసిఫిక్ ఎలర్జీలు ఉంటాయి.ఆహార పదార్థాల వల్ల అతిగా ప్రభావితం కావడం అంటే ఎలర్జీలు రావడానికి కారణం బహుశా పర్యావరణం సంబంధితమైన ఇంకా పాశ్చాత్య జీవన శైలులకు అలవాటుపడడం కావొచ్చు.

వర్దమాన దేశాలలో అలర్జీల రేటు చాలా తక్కువగా ఉంది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కన్న పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపస్తున్నాయి.దీనికి కారణం కాలుష్యం, తినే ఆహారంలో మార్పులు, మన రోగ నిరోధక వ్యవస్థల ప్రతిస్పందనలో మార్పులు తెచ్చే సూక్ష్మజీవులు తక్కువ ఉండడం. వలస వెళ్ళిన వారికి తమ స్వదేశంలో కన్న ఎక్కువ మందికి తాము నివసించే ప్రదేశంలో ఆస్థమా, ఆహార ఎలర్జీలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది.