టచ్ చేసి చూడు… తెలుగు బులెట్ రివ్యూ

Touch Chesi Chudu Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   రవితేజ, రాశి ఖన్నా, సీరత్ కపూర్ , సత్యం రాజేష్ , వెన్నెల కిషోర్ 
నిర్మాత:    నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ మోహన్ 
దర్శకత్వం :  విక్రమ్ సిరికొండ 
సినిమాటోగ్రఫీ:  చోటా కె. నాయుడు , రిచర్డ్ ప్రసాద్ 
ఎడిటర్ :   గౌతమ్ రాజు 
మ్యూజిక్ :  ప్రీతం (JAM8)

మాస్ మహారాజ రవితేజ… పేరుకు తగ్గట్టే వరుసగా మాస్ చిత్రాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు… కొంత కాలం నుంచి సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రవితేజ కి , రీసెంట్ గా విడుదల అయిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం ద్వారా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు… ఒకప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “విక్రమార్కుడు” , బాబీ దర్శకత్వంలో వచ్చిన “పవర్” సినిమాలో పోలీస్ అధికారిగా నటించి, తన పవర్ ఏంటో అందరికి చూపించాడు. ఇప్పుడు అదే ఊపులో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ అనే చిత్రంలో మళ్ళీ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత ‘టచ్ చేసి చూడు’ మూవీ వస్తుండడంతో ఈ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి… ఆ అంచనాలకు తగ్గట్టు ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఉందో… లేదో… తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్ళాల్సిందే…

కథ:

కార్తికేయ (రవి తేజ) ACP గా నిధులు నిర్వహిస్తుంటాడు… ఫ్యామిలీ కంటే, డ్యూటీ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. అక్కడ ‘లాలా’ అనే రాజకీయనాయకుడు తన రౌడీఇజం తో అందరిని బయపెడుతూ డబ్బుతో రాజకీయం చేస్తుంటాడు. తన కొడుకు ‘ ఇర్ఫాన్ లాలా’ ని రాజకీయనాయకుడుగా చేయాలనే ఉద్దేశంతో, అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ని చంపేసి మధ్యంతర ఎలక్షన్స్ వచ్చేలా చేస్తాడు… కానీ ఆ ఎలక్షన్ లో ఇర్ఫాన్ లాలా ఓడిపోతాడు. ఆ కోపంతో ఒక అమ్మాయిని పార్టీ జరుగుతూ ఉండగా చంపేస్తాడు లాలా. ఆ చనిపోయిన అమ్మాయి తల్లి (సుహాసిని) న్యాయం కోసం దీక్ష చేస్తుంది… ఆ కేసు వైరల్ అవ్వడంతో అప్పుడు కమీషనర్ (మురళీ శర్మ) ఆ కేసు ని కార్తికేయ కు అప్పగిస్తాడు… కార్తికేయ, ఇర్ఫాన్ లాలా ని పట్టుకునే క్రమంలో ఇర్ఫాన్ లాలా ని చంపేస్తాడు. ఆ తర్వాత కమీషనర్, కార్తికేయ ని సస్పెండ్ చేస్తాడు. సస్పెండ్ అయిన కార్తికేయ ఫ్యామిలీ కి ఇంపార్టెన్స్ ఇస్తూ సొంతంగా ఒక కంపెనీ పెట్టుకొని జీవిస్తుంటాడు. ఒకరోజు కార్తికేయ సిస్టర్ ఒక హత్యను చూస్తుంది, ఆ విషయం కార్తికేయ కు చెపుతుంది… అప్పుడు కార్తికేయ తన చెల్లి చేత సాక్ష్యం చెప్పించటానికి ట్రై చేస్తాడు… ఈ క్రమంలో ఆ హత్య చేసింది కూడా ఇర్ఫాన్ లాలా అని తెలుసుకొని తనను పట్టుకోవటానికి మళ్ళీ పోలీస్ గా మారతాడు… అసలు చనిపోయిన ఇర్ఫాన్ లాలా మళ్ళీ ఎలా బ్రతికాడు?, అసలు కమీషనర్ కార్తికేయ ని ఎందుకు సస్పెండ్ చేశాడు? ఇర్ఫాన్ లాలా ని కార్తికేయ ఎలా పట్టుకుంటాడు? సస్పెండ్ అయిన తర్వాత కార్తికేయ ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అని తెలుసుకోవాలంటే ‘టచ్ చేసి చూడు’ మూవీ చూడాల్సిందే…

విశ్లేషణ:

‘టచ్ చేసి చూడు’ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ సీన్స్ లో రవి తేజ తన విశ్వరూపం చూపించాడు. కానీ ఫస్ట్ హాఫ్ లో అంతా రవితేజ రొటీన్ కామెడీతోనే నడవడంతో ప్రేక్షకులు కొంచెం అసహనానికి గురి అవ్వుతారు. కానీ సెకండ్ హాఫ్ యాక్షన్, కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్లు గా నటించిన రాశి ఖన్నా, సీరత్ కపూర్ లు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రలు కావు. కానీ వాళ్ళకు ఇచ్చిన పాత్రలో వాళ్ళు బాగానే నటించారు. ముఖ్యంగా రాశి ఖన్నా తన అందంతో కుర్రకారుని ఆకట్టుకుంది. ఇంకా ప్రతినాయకుడిగా నటించిన ఫ్రెడ్డి దరువలా బాగా నటించాడు. ఫస్ట్ హాఫ్ లో సత్యం రాజేష్, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్, మురళీ శర్మ కామెడీ బాగుంది. ఇంకా దర్శకుడు ‘విక్రమ్ సిరికొండ’ అతనిది ఫస్ట్ సినిమా అయినా ‘టచ్ చేసి చూడు’ సినిమాను చాలా బాగా హండిల్ చేసాడు. ఎప్పుడు రవితేజ తో రొటీన్ కామెడీ చేయించకుండా ఇంకా కొంచెం  కేర్ తీసుకొని ఉంటే బాగుండేది… ఫస్ట్ హాఫ్ మూవీ డల్ అయినా, ‘విక్రమ్ సిరికొండ’ సెకండ్ హాఫ్ ని బాగా తీర్చిదిద్దాడు. కానీ క్లైమాక్స్ లో సినిమాని అనుకున్న విధంగా ఫినిష్ చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ  చోటా కె. నాయుడు ప్రతి ఫ్రేమ్ ని చాలా బాగా, చాలా అందంగా తీసాడు. రవి తేజ ని, రాశి ఖన్నా, సీరత్ కపూర్ లను బాగా చూపించాడు. మ్యూజిక్ విషయానికి వస్తే ‘ప్రీతం’ బాగా ఆకట్టుకోలేకపోయాడు. మ్యూజిక్ బాగుంటే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. ఎడిటర్  ‘గౌతమ్ రాజు’ ఫస్ట్ హాఫ్ లో కొంచెం కత్తెరలు పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతలు నల్లమలపు బుజ్జి, వల్లభనేని వంశీ మోహన్  ఎక్కడ రాజీపడకుండా సినిమాను బాగా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ …

రవితేజ
సెకండ్ హాఫ్
యాక్షన్

మైనస్ పాయింట్స్ …

రొటీన్‌ కథా కథనం, ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
మ్యూజిక్

తెలుగు బులెట్ రేటింగ్ … 2.75\5