చిన్నారులు స్కూలికి లేదా బయటకు వెళితే ఎక్కడున్నారు.. సరిగా వెళ్లారా లేదా అనే కంగారు తల్లిదండ్రుల్లో ఉంటుంది. అలాంటి ఆదుర్దాని గుర్తించిన అల్కాటెట్ సంస్థ కొత ్త స్మార్ట్‌వాచ్ ఒకటి విడుదల చేసింది. గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఎనేబుల్ అయిన ఈ డివైస్ ద్వారా తమ పిల్లలు ఎక్కడున్నారో ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. దీంట్లో అత్యవరస నంబర్లకు సందేశం పంపే విధంగా ఎస్‌వోఎస్ బటన్ కూడా ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే ముందుగా దాంట్లో అప్రూవ్ చేసిన కాంటాక్ట్ కి సమాచారం వెళుతుంది. ఒకవైపు ఎక్కడున్నారో తెలుసుకోవడంతోపాటు ఆపద సమయంలో వెంటనే సమాచారం పంపేలా వ్యవస్థ ఏర్పాటు ఉండటం దీని ప్రత్యేకత.. కేవలం 40 గ్రాముల బరువే ఉంటుంది. బ్యాటరీ 370 ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకధాటిగా రెండు గంటల పాటు మాట్లాడినా పర్వాలేదట.. ముఖ్యంగా మన దేశాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ వాచీకి రూపకల్పన చేశారట.. దాదాపు 40 శాతం జనాభాలో 15 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారని.. వారి భద్రతకు సంబంధించిన అంశంగా భావించే ఈ ప్రాడెక్టు విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. మరి ఇన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ ధరెంతుంటుందో అని కంగారు పడుతున్నారా.. ధర కూడా అందుబాటులో రూ.4,799 మాత్రమే అని ప్రకటించింది.