మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 19మంది మృత్యువాత

లాక్ డౌన్ వేళ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ – నాందేడ్ మార్గంలో ఈరోజు తెల్లవారు జామున ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై నిద్రిస్తున్న వలస కార్మికులపై ఓ గూడ్స్ రైలు దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడినట్లుగా సమాచారం అందుతుంది.

కాగా ‘కర్మాడ్ ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఖాళీగా వెళుతున్న గూడ్స్ రైలు కొంతమందిపై గుండా వెళ్లింది. విషయం తెలుసుకున్న వెంటనే, రైల్వే, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మరింత సమాచారం వెలువడాల్సివుంది’ అని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.