స్థానిక సంస్థలు అన్ని రంగాల్లో స్వావలంబన సాధించి స్థానిక ప్రభుత్వాలుగా మారేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు. దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీలో జాతీయ సమగ్రతా ప్రాంగణాలు నెలకొల్పాలని, అక్కడే జాతీయ స్తూపం నిర్మించాలన్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
