దాదాపు రెండు దశాబ్ధాల పాటు తెలుగులో అగ్రనటిగా రాణించారు చెన్నై భామ త్రిష. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన త్రిష చివరిగా జూనీయర్ సరసన ‘దమ్ము’లో చిత్రంలో నటించారు. ఆ తర్వాత సినిమాలకు కాస్తా విరామం ఇచ్చిన త్రిష ప్రస్తుతం తెలుగులో తక్కువ.. తమిళ సినిమాలలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక మూడు పదుల వయసుకు వచ్చినప్పటికి ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఓ వ్యాపారవేత్తతో ఆమెకు నిశ్చితార్థం జరిగినప్పటికి అది పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ఆ తర్వాత త్రిష సినిమా పరిశ్రమలోని ఓ హీరోతో ప్రేమయాణం నడుపుడుతున్నట్లు తరచూ వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తమిళ హీరో శింబు-త్రిషలు ప్రేమలో ఉన్నారని, త్వరలో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ఓ ఇంటర్యూలో త్రిష తన పెళ్లిపై క్లారిటి ఇచ్చారు. ‘నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. నన్ను పూర్తిగా అర్థం చేసుకునే వ్యక్తి దొరికినప్పుడే నా పెళ్లి లేదంటే సింగిల్గానే ఉంటాను’ అని పేర్కొన్నారు. అంతేగాక తను ప్రేమ వివాహమే చేసుకుంటానని, మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు పెళ్లి చేసుకోనన్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తి తారసపడకుంటే జీవితాంతం ఒంటరిగా ఉండటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం త్రిష మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’లో నటిస్తున్నారు