మళ్ళీ పెళ్లి ఆలోచనలో త్రిషా !

Trisha Getting ready for marriage

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఈ మధ్య హీరోయిన్లు వరస పెట్టి పెళ్లిళ్లు చేసుకొంటూ ఉన్నారు. చేసేసుకుంటున్నారు. బహిర్గతంగా చేసుకున్నా రహస్యంగా చేసుకున్నా బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల పెళ్లి వార్తలు వరసగా వస్తూనే ఉన్నాయి. సమంత మొదలు అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, నేహా ధూపియా, ఇలియానా ఇలా వీళ్లంతా ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు మరికొంతమంది హీరోయిన్లు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఒక దక్షిణాది ప్రముఖ హీరోయిన్ పేరు కూడా చేరనుందనే ప్రచారం మొదలయ్యింది. ఆమె ఎవరో కాదు చెన్నై బ్యూటీ త్రిషా. నిజానికి ఆ మధ్య ఒక వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి వరకూ వెళ్లలేదు ఆ నిశ్చితార్థం. ఇప్పుడు మరో వ్యాపారవేత్తతో త్రిష ప్రేమలో ఉందని… త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వస్తున్నాయి.

మ‌రో మూడు నెలల్లో త్రిష పెళ్లి పీట‌లు ఎక్క‌బోతోంద‌ని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది. పెళ్లి కోసమే త్రిష విదేశాల్లో భారీగా షాపింగ్ చేస్తోంద‌ట‌. అది క‌చ్చితంగా వెడ్డింగ్ షాపింగేన‌ని తమిళ మీడియా రాస్తోంది. అయితే ఈ విషయాన్ని త్రిష కానీ ఆమె తల్లి కానీ ధ్రువీకరించలేదు. అయితే త్రిష పెళ్లి చేసుకున్నాకే ప్రకటన చేయనుందని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇంతకు ముందు శ్రియ కూడా పెళ్లి చేసుకున్న తరువాత గాని ఆమె అభిమానులకు విషయం తెలియలేదు. అంతకుముందు షాపింగ్ లతో బిజీ బిజీగా గడిపినా తన ఫ్రెండ్ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నట్లు కవర్ చేసింది. కానీ పెళ్లి జరిగాక గాని అసలు మ్యాటర్ తెలియలేదు పెళ్లి ఆమెదే అని. ఇదే కోవలో ఇప్పుడు త్రిష కూడా తన గతాన్ని వదిలేసి మళ్ళీ పెళ్లి పనుల్లో బిజీ అయినట్టు వార్తలు వస్తున్నాయి.