వంశీ సినిమా కోసం మీసకట్టుతో మహేష్ !

Mahesh Babu beard and Mustache look for Vamsi Paidipally movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘భరత్ అనే నేను’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న మహేశ్ బాబు, తన నెక్స్ట్ సినిమాను వంశీ పైడిపల్లితో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే రానున్న సినిమాలో మహేష్ బాబు లుక్ మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. ఎందుకంటే ‘భరత్ అనే నేను’ సినిమా ప్రమోషన్స్ సమయంలో… నెక్స్ట్ మూవీలో తాను కొత్త లుక్ తో కనిపించనున్నట్టు చెప్పాడు. అది కూడా ఈ సినిమాలో ‘మీస కట్టు’తో కనిపించనున్నానని అదే ఇంటర్వ్యులో చెప్పాడు. సో ఇప్పుడు ఆయన లుక్ ఎలా వుండనుందా అనే ఆసక్తి అందరిలో మొదలైంది.

స్టోరీ ప్రకారం, సినిమాలో మహేష్ కు మిల్కీ బాయ్ లుక్ సెట్టవ్వదని, గడ్డం, మీసం లుక్ తో కనిపించాలని డైరెక్టర్ ఖచ్చితంగా చెప్పడంతో, ఇప్పుడు మహేష్ కెరీర్లో ఫస్ట్ టైం, ఫుల్ మీసకట్టు, గడ్డం తో కనిపించబోతున్నాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ‘భరత్ అనే నేను’లో ఒక పాటలో చిన్న బిట్ లో ఆయన మీసా కట్టుతో కనిపిస్తేనే ఆడియన్స్ సంబర పడిపోయారు. కృష్ణ గారి అభిమానులు అయితే మహేష్ లో కృష్ణని చూసుకున్నారు. అలాంటిది ఆయన ఈ సినిమాలో మీసకట్టుతోనే కనిపించనున్నాడని అంటున్నారు.