Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ లో జనసేన కార్యాలయ ప్రారంభం సింపుల్ గా జరిగింది. బహుకొద్ది మంది సమక్షంలో కార్యాలయంలోకి పవన్ అడుగు పెట్టారు. పవన్ చుట్టూ ఉన్నవారిలో జనసేన పార్టీ మీడియా విభాగం హెడ్ హరిప్రసాద్ వంటి వారు మినహా రాజకీయంగా ప్రపంచానికి తెలిసిన వాళ్ళు లేరు. అయితే అందరికీ చిరపరిచితమైన, చిత్ర పరిశ్రమతో, పవన్ తో దగ్గరి సంబంధాలున్న ఇద్దరు ఈ కార్యక్రమంలో పాల్గోవడం కొత్త చర్చకి దారి తీసింది . ఆ ఇద్దరు మరెవరో కాదు పవన్ కి సన్నిహితులు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అలీ.
జనసేన కార్యాలయంలో త్రివిక్రమ్,అలీ తో పాటు సురేష్ బాబు కూడా కనిపించారు. అయితే సురేష్ బాబు మర్యాదపూర్వకంగానే అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన ఇద్దరు పవన్ తో వున్న స్నేహం కోసమే అక్కడికి వచ్చారా లేక జనసేన తో కలిసి నడుస్తారా అన్న చర్చ మొదలైంది. త్రివిక్రమ్ , అలీ కి పవన్ ఎంత దగ్గరో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆ ప్రయాణం రాజకీయంలో కూడా కొనసాగుతుందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంలో పవన్ ఆ ఇద్దరితో మాట్లాడినట్టు తెలుస్తోంది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా పార్టీ ప్రచార వ్యూహం, నిర్వహణలో ఈ ఇద్దరూ కీలక పాత్ర వహించే అవకాశం ఉందట.