త్రివిక్రమ్ సినిమా కథలనే అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ చెబుతున్నాడని ఎంత ట్రోలింగ్ జరిగినా కానీ వాటికి వందల కోట్లు వసూలు చేసే సత్తా ఉందని అల వైకుంఠపురంలో నిరూపించింది. తదుపరి చిత్రాన్ని తారక్ తో ఓకే చేసుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం ఆ సినిమా కథ మీదే కసరత్తు చేస్తున్నాడు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఇరవై కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద స్టార్ హీరోలకు తీసిపోని ఇమేజ్ ఉంది కనుక త్రివిక్రమ్ కి ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఉండొచ్చు. అయితే కరోనా తర్వాత మార్కెట్ లెక్కలు మారతాయని భావిస్తున్నారు. అప్పుడు మరి త్రివిక్రమ్ పారితోషికంపై కూడా కోత పడుతుందో లేదో తెలీదు.
ఎన్టీఆర్ కి నలభై కోట్ల పారితోషికంతో పాటు తన సోదరుడు కళ్యాణ్ రామ్ కి నిర్మాతగా వాటా ఇచ్చారు. కరోనా విపత్తు ముగిసిన తర్వాత ఈ లెక్కలన్నిటినీ సవరించుకుని బడ్జెట్ తిరిగి వేస్తారో లేక ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి అంత మామూలైపోయి ఇదే బడ్జెట్ కి ఫిక్స్ అవుతారో వేచి చూడాలి.