“శాంతల” ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసిన త్రివిక్రమ్.!

“శాంతల” ఫస్ట్ సింగిల్ లాంచ్ చేసిన త్రివిక్రమ్.!
Cinema News

టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏవైనా ఇతర సినిమాలకి సంబంధించి టీజర్ సాంగ్ లాంటివి లాంచ్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగే అంశం. అయితే లేటెస్ట్ గా త్రివిక్రమ్ ఒక సాంగ్ ని లాంచ్ చేయడం ఆసక్తిగా మారింది. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతకం పై కె ఎస్ రామారావు గారి సమర్పణలో అమెజాన్ ప్రైమ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినా ఫామిలీ మాన్ ఫేమ్ అశ్లేషా ఠాకూర్ ప్రధాన పాత్ర లో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వం లో డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన పీరియడ్ సినిమా “శాంతల”. ఈ సినిమా యొక్క మొదటి పాట ను ప్రముఖ దర్శకుడు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేసారు. పాటను విక్షించి త్రివిక్రమ్ గారు తన శుభాకాంక్షలు కూడా తెలియజేసారు.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల సినిమా చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది అని తెలియజేసారు.

సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ సినిమా కి సంచలన సంగీతం సమాకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల సినిమాకి సంగీతం అందించగా డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మాణం వహించారు. అలాగే ఈ సినిమా తొందరలోనే రిలీజ్ కానుంది.