త్రివిక్రమ్‌కు 2018 చాలా ప్రత్యేకం…

Trivikram Srinivas Next movies in 2018
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకుడిగా కెరీర్‌ను ఆరంభించి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తుంది. కాని ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. కారణం ఆయన స్టార్‌ హీరోలతో సినిమాలు చేయడం మరియు కథ విషయంలో ఎక్కువ వర్క్‌ చేయడం వంటి కారణాల వల్ల త్రివిక్రమ్‌ కనీసం సంవత్సరంలో ఒక్కటి కూడా సినిమాను చేయలేక పోతున్నాడు. గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్‌ సంవత్సరంలో ఒకటి చొప్పున సినిమా చేస్తూ వస్తున్నాడు. అయితే 2018లో మాత్రం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మూడు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

2018 జనవరిలో సంక్రాంతి కానుకగా పవన్‌ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాబోతుంది. ఇక ఫిబ్రవరి నుండి ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ మూవీ మొదలు కాబోతుంది. ఎన్టీఆర్‌తో మూవీని కేవలం నాలుగు నెలల్లోనే పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనే పట్టుదలతో త్రివిక్రమ్‌ ఉన్నాడు. ఇక ఎన్టీఆర్‌తో సినిమా పూర్తి అయిన తర్వాత వెంకటేష్‌తో సినిమాను త్రివిక్రమ్‌ చేయబోతున్నాడు.

బాలీవుడ్‌లో సక్సెస్‌ అయిన ఒక చిత్రాన్ని వెంకీతో రీమేక్‌ చేయాలని త్రివిక్రమ్‌ ఆశ పడుతున్నాడు. అందుకు వెంకీ కూడా ఓకే చెప్పాడు. అది కూడా ఇదే సంవత్సరం డిసెంబర్‌లో విడుదల చేసేలా మాటల మాంత్రికుడు ప్లాన్‌ చేస్తున్నాడు. మొత్తానికి 2018లో త్రివిక్రమ్‌ ఏకంగా మూడు చిత్రాలను విడుదల చేయబోతున్నాడు. ఈ మాట ఆయన అభిమానులకు కేజీ స్వీట్స్‌ ఒకే సారి తిన్నట్లుగా అనిపించి ఉండవచ్చు. పక్కా ప్లాన్‌తో చేసుకుంటూ వెళ్తే తప్పకుండా త్రివిక్రమ్‌ అనుకున్నట్లుగా ఈ సంవత్సరంలో మూడు సినిమాలు ఖాయం. వెంకీ సినిమా కాస్త అటు ఇటు అయినా కూడా పవన్‌, ఎన్టీఆర్‌లతో 2018లో త్రివిక్రమ్‌ సందడి చేయబోతున్నాడు.