ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి. 2014 నుండి 2018 వరకు తెలంగాణ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు హుజురాబాద్ నియోజకవర్గం నుండి తెలంగాణ శాసనసభకు ఎన్నిక అయ్యాడు.
పార్టీ ప్రారంభం నుండి పార్టీ సుప్రీం కె చంద్రశేఖర్ రావుతో ఈటెల రాజేందర్ ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. టీఆర్‌ఎస్‌ను కొద్ది రోజులుగా మంత్రి ఈటెల రాజేందర్ కథనాలు వినిపించగ ఈ ప్రచారంపై ఈటల స్పందించి అతను టీఆర్‌ఎస్‌ను వీడేదిలేదని స్పష్టం చేశారు.
రోజు నాలుగు జిల్లాల్లో ఇరవై సభల్లో లక్షల మందిని కలిసి ఉద్యమం నడిపిన వాళ్లం మేము అని ఆయన హుజురాబాద్‌లో జరిగిన ఓసమావేశంలో చెప్పారు.
2004 సార్వత్రిక ఎన్నికలలో కమలాపూర్ నుండి ఎన్నిక అయిన ఈటల రాజేందర్ వ్యాఖ్యలు అప్పట్లో పార్టీ అధినేతనే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరిగింది. ఈ విషయంపై ఈటెల రాజేందర్ కు కేటీఆర్ ఫోన్ చేసి ఈటల వ్యాఖ్యలపై ఆరా తీశారు. దీనిపై కేసీఆర్‌ను ఉద్దేశించి ఏమీ అనలేదని సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి చేస్తున్న ప్రచారానికి జవాబు ఇచ్చానని నాలుగుసార్లు శాసనసభ సభ్యుడుగా ఎన్నికైన మంత్రి ఈటెల చెప్పారు.