కెసిఆర్ కి డీఎస్ ఝలక్ ?

D srinivas jump from TRS to congress kcr shocked

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కెసిఆర్ ఎత్తుగడలకు ధీటుగా కౌంటర్ ఇవ్వడానికి కూడా విపక్ష కాంగ్రెస్ తడబడింది. ప్రజాబలం విషయం ఎలా వున్నా టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డి మాత్రమే అప్పుడప్పుడు కెసిఆర్ ని కొంతలో కొంత అయినా ఇబ్బంది పెట్టగలిగారు. అయితే ఇప్పటిదాకా వెనకపడిందనుకున్న కాంగ్రెస్ ఇప్పుడు కెసిఆర్ కి డీఎస్ రూపంలో భారీ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధాన్ని వదులుకున్న డీఎస్ అనూహ్యంగా తెరాస లో చేరి రాజ్యసభ సభ్యుడు అయిన విషయం అప్పట్లో సెన్సషన్. అప్పటికే కేంద్ర, రాష్ట్ర మధ్య సంబంధాలపై తెరాస సర్కార్ తరపున డీఎస్ సలహాదారుగా పని చేస్తున్న సంగతి కూడా తెలిసిందే.

ఢిల్లీ వేదికగా పనిచేస్తున్న డీఎస్ కొద్దిరోజులకే తెరాస లో తనకి తగిన గౌరవం లభించడం లేదని ఫీల్ అయ్యారట. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానంతో తిరిగి సత్సంబంధాల కోసం ట్రై చేసి సక్సెస్ అయ్యాడంట. ఇటీవల తెలంగాణాలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా సోనియా గాంధీని కలిశారట. ఆమె మాటల్లో డీఎస్ సలహాలు కూడా తీసుకోమని చెపితే ఆయన పార్టీ మారిన విషయాన్ని ఉత్తమ్ గుర్తు చేశారట. అయినా పర్లేదు అని సోనియా జవాబు ఇవ్వడంతో డీఎస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్టు ఉత్తమ్ కి అర్ధం అయ్యిందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 లో కూడా తెలంగాణాలో కాంగ్రెస్ అవకాశాలు అంతగా కనిపించడం లేదు.అయినా డీఎస్ కాంగ్రెస్ వైపు మొగ్గుజూపడానికి తెరాస లో ఎదురైన అవమానాలే కారణం అంటున్నారు. డీఎస్ సొంత గూటికి చేరుకుంటే తెరాస కి తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయంగా తగిలిన తొలి దెబ్బ అవుతుంది.

మరిన్ని వార్తలు

కేసీఆర్ తెలివే తెలివి

హర్మన్ ప్రీత్ కు ఉద్యోగం ఇవ్వలేదా..?

విశాఖ స్కామ్ ఏ తీరానికి చేరునో..?