భారత్​కు ముందే చెప్పామంటూ.. మళ్లీ నిప్పురాజేసిన ట్రూడో వ్యాఖ్యలు..

Trudeau's comments set fire again as if India had already been told..
Trudeau's comments set fire again as if India had already been told..

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్​పై అసత్య ఆరోపణలు చేస్తూ ఇప్పటికే సొంత దేశంలో వ్యతిరేకత కూటగట్టుకుంటూ మరోసారి అదే పంథా కొనసాగించారు. ఈసారి కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే మళ్లీ అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన సమాచారాన్ని కొద్దివారాల క్రితమే భారత్‌కు కెనడా వెల్లడించిందని ట్రూడో చెప్పారు.

తాజాగా మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత ట్రూడో పెంచారు . ఖలిస్థాన్ నేత హత్య విషయం గురించి తాను మాట్లాడిన సమాచారం గురించి కొన్ని వారాల క్రితమే భారత్​కు వెల్లడించామని.. ఈ విషయంలో మేం భారత్‌తో నిర్మాణాత్మకంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ట్రూడో పేర్కొన్నారు. ఈ సీరియస్‌ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్‌ తనతో కలిసిపనిచేస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఖలిస్థానీ నేత నిజ్జర్‌ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపిస్తూ ఇటీవల ట్రూడో చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే.