హెచ్4 డిపెండెంట్ వీసాపైనే ఉంటున్నవారి పిల్లలు ఎవరైతే ఇండియాలోపుట్టి తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లినవారు ఇకపై ఎఫ్1 స్టూడెంట్ వీసా తీసుకోకపోతే ఇండియాకు వచ్చేయాలల్సి వస్తుందట. ఒక్కో దేశానికి 7శాతం పరిమితితో, ఉద్యోగరీత్యా హెచ్1 బీ వీసా ఉన్నవారికోసం అమెరికా 1.4లక్షల గ్రీన్ కార్డులను ప్రతిఏటా ఇస్తుంది.7శాతం పరిమితి కారణం వల్ల గ్రీన్ కార్డు కోసం చాలామంది ఇండియన్లు ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. అసలే అమెరికాకు వెళుతున్న వారి జాబితాలో మన వాళ్లు ఎక్కువ, హెచ్1 బీ వీసాపై ఉంటూ అమెరికాలో ఉద్యోగం చేస్తుంటారు.న్యూయార్క్ లోని ఇమిగ్రేషన్ సంస్థ ఫౌండర్ సైరస్మెహతా హెచ్1బీవీసాపై ఉంటున్న చాలా దేశాలవారికి ఆరేళ్లలోపే గ్రీన్ కార్డు వస్తుందని,ఇండియన్లకు మాత్రం కనీసం పదేళ్లు పడుతోందని చెప్తున్నారు.2018లో గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో 6లక్షల పైనే ఇండియన్లు ఉన్నారు.
ఇటు ఉద్యోగులకే కాకుండా వారిపిల్లలకు సైతం ఇబ్బందులు కలిగే పరిస్థితి ఎదురవుతోంది.ఇకపై 21 ఏళ్లు పైన ఉన్నవాలందరు ఎఫ్1వీసాకు దరఖాస్తు చేస్కోవాలి,వస్తుందన్న గ్యారెంటీ లేదు,రాకుంటే అమెరికాను విడిచి పెట్టి వెళ్లపోవాలి.ఇలా ఉద్యోగులకే కాకుండా వారి పిల్లలకు సైతం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.అయితే హెచ్1బీవీసా హోల్డర్లకు అమెరికాలోనే పిల్లలు పుడితే ఆ దేశ పౌరసత్వం వస్తుంది, వాళ్లకు ఇది వర్తించదు.