తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.
మార్చి 6న బడ్జెట్ ఆమోదంపై తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. సభ ఎన్ని రోజులు జరగాలనేది బీఏసీలో నిర్ణయించనున్నారు. మార్చి 7న ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2014, 1970లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయి.