నిబద్దత, క్రమ శిక్షణతో ఆర్టీసీ విధులని నిర్వహిస్తోంది. అయితే అటువంటి సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం మంచిది కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బంది పై ఒత్తిడి బాగా పెరిగింది. అయినా కానీ ఓపిక, సహనం తో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి ఘటనలు సిబ్బంది లో ఆందోళన కలిగిస్తున్నాయి అని విసి సజ్జనార్ అన్నారు.
సంగారెడ్డి జిల్లా ఆందోల్ లోని ఎంపీడీవో కార్యాలయం దగ్గర మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. బైకర్ నిర్లక్ష్యంగా నడపి ప్రమాదానికి కారణం అయ్యి, అయినా తన తప్పేం లేదన్నట్టు మళ్ళీ హైర్ బస్ డ్రైవర్‌పై దాడి చేసాడని అన్నారు. దుర్బాషలాడుతూ విచక్షణరహితంగా కొట్టారని చెప్పారు. ఇలాంటి దాడులను యాజమాన్యం సహించదు అన్నారు. ఈ ఘటన మీద అందోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారన్నారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను సజ్జనార్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.