TS Politics: HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు

BREAKING NEWS: Former HMDA director Siva Balakrishna released from jail
BREAKING NEWS: Former HMDA director Siva Balakrishna released from jail

HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు నాలుగవ రోజు కస్టడీలోకి తీసుకున్నారు. శివ బాలకృష్ణను విచారిస్తున్నారు అధికారులు.. అతని బినామీలు, బ్యాంకు లాకర్ల గురించి ఆరా తీస్తున్నారు. రెరా కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎవరెవరు బాలకృష్ణకు సహకరించారు అనే దానిపై విచారణ చేపట్టారు. బయటపడ్డ ఆస్తులు ఎలా సమకూరాయన్న అంశాలపై బాలకృష్ణ నుంచి ఏసీబీ అధికారులు వివరాలు రాబడుతున్నట్టు సమాచారం.

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అలాగే ఎనిమిది రోజుల పాటు ఏసీబీ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఇప్పటికి మూడు రోజుల పాటు శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఈ క్రమంలో భారీగా అక్రమస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మూడు రోజుల కస్టడీలో వందల డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన మూడు బ్యాంక్ లాకర్లను శుక్రవారం అధికారులు తెరిచారు. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. తన కుటుంబసభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూముల పక్కనే బినామీల పేర్లతో భూములను బాలకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించాడు. బినామీల పేర్లతో భూమి పాస్‌పుస్తకాలు బయటపడ్డాయి. దీంతో బినామీలకు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు పంపించారు.