తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ చలాన్లపై రేపే చివరి తేదీ కానుంది. ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు రేపటితో ముగుస్తుంది. ద్విచక్ర వాహనాలపై 80%, భారీ వాహనాలతో పాటు నాలుగు చక్రాల వాహనాలపై 60% ఉన్న రాయితీ గడుగు ముగిశాక అందుబాటులో ఉండదు.
ఆ తర్వాత చలాన్లు 100% చెల్లించాల్సి ఉంటుంది. మీ సేవతో పాటు ఆన్లైన్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. చెల్లింపుల్లో ఎలాంటి సందేహం ఉన్నా 8712661690, 040-27852721 వాట్సాప్ నంబర్లలో సంప్రదించవచ్చు.