TS Politics: సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు… టూర్ వివరాలివే

TS Politics: Another Bharat Gaurav train from Secunderabad... tour details
TS Politics: Another Bharat Gaurav train from Secunderabad... tour details

ఐఆర్సీటీసీ తెలుగు రాష్ట్రాల్లోని పలు రూట్స్ లో నడపుతూ ఉన్న భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లలో పుణ్యక్షేత్ర యాత్ర బాగా పాపులర్ అయ్యింది. గతేడాది కాశీ గయ విచిత్ర పిండ దాన్ యాత్ర సక్సెస్ కావడంతో తాజాగా జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ్ యాత్రకు భరత్ గౌరవ్ ప్లాన్ చేసింది.ఈ యాత్ర జనవరి 23 నుంచి 9 రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ,తమిళనాడులోని టూరిస్ట్ స్పాట్ లను కవర్ చేస్తుంది.రామేశ్వరం, తిరుచ్చి, కన్యాకుమారి, మదురై,తిరువణ్ణామలై, త్రివేండ్రం, తంజావూరు వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రయాణీకులు, యాత్రికులకు టూర్ అవకాశం కల్పిస్తోంది.

ఈ యాత్రకు వెళ్లాలనుకునే ప్రజలకు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటలలో బోర్డింగ్, డి-బోర్డింగ్ కావచ్చు. ప్రయాణికులకు వసతి, సౌకర్యాలు, క్యాటరింగ్, భోజనం తో పాటు భద్రతా చర్యలు, ప్రయాణ భీమా వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి.

టూరిస్టులకు ఎకానమీ కేటగిరీలో ఒక్కొక్కరికి రూ.14,100 స్టాండర్డ్ కేటగిరీ (3ఎసి)కి రూ.21,500, కంఫర్ట్ కేటగిరీ (2AC) కోసం రూ. 27,900గా ఉంది. ఎవరైనా ఈ యాత్ర వెళ్లాలనుకునే వాళ్లు IRCTC వెబ్ సైట్ను సందర్శించవచ్చు.