తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణాకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన విషయం తెలిసిందే.సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజహారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా యువతకు ఉపాధికల్పన కోసం పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఆదానీ, గోది, వెబ్ వర్క్స్,గోద్రెజ్, జేఎస్ డబ్ల్యూ, ఆరా జెన్ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం యువతకు ఉపాధి కల్పించడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లను గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో సోనియాగాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.