బీజేపీకి బిగ్ షాక్.. బలమైన బీసీ నేత, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గడిచిన మూడున్నర సంవత్సర కాలంలో బీజేపీ పార్టీ ఎలాంటి పదవులు అప్పగించిన, GHMC ఎన్నికలతో పాటు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మరియు పార్టీ కార్యక్రమాలలో తన వంతు బాధ్యత పోషించానని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
క్రమశిక్షణకు బీజేపీ పెట్టిందే పేరంటూ ఉపన్యాసాలలో చెబుతుంటారు. పెద్ద పెద్ద నాయకులే బహిరంగంగా కొట్టుకుంటున్నారు. బీజేపీ పట్ల నమ్మకంతో పార్టీలో చేరిన వారిని అంటరాని వారిగానే చూస్తున్నారని, కెసిఆర్ ప్రభుత్వాన్ని అధికారం దించే ఉద్దేశ్యంతో పార్టీలో చేరిన నాలాంటి నాయకులకు పార్టీ మొండిచెయ్యి చూపించండం మంచిది కాదని , ప్రజల్లో కనీస ప్రభావం చూపని నాయకులకు పార్టీ పదవులు ఇవ్వడం మా లాంటి వాళ్ళపైన పెత్తనం చెలాయిచడం సమంజసం కాదని రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.అసెంబ్లీ ఎన్ని కలలో పార్టీఓటమికి బాధ్యత ఎన్నికల తర్వాత ఓటమికి ఎవరూ బాధ్యత తీసుకోలేదని విక్రమ్ గౌడ్ ఆరోపించారు. లోక్ సభకు పోటీ చేసే అవకాశంపై పార్టీహైకమాండ్ నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీని వీడుతున్నట్లు విక్రమ్ గౌడ్ కిషన్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు
.
ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో బలమైన గౌడ సామాజికవర్గానికి చెందిన నాయకుడు ముఖేష్ గౌడ్ కుమారుడైన విక్రమ్ గౌడ్ రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీవీడొద్దంటూ బీజేపీ నేతలు బుజ్జగించినప్పటికీ, లోక్ సభకు పోటీ విషయంలో స్పష్టమైన హామీ రానందున విక్రమ్ గౌడ్ రాజీనామాకే మొగ్గుచూపారని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో విక్రమ్ గౌడ్ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.