తెలంగాణ పేదలకు షాక్.. జనవరి పెన్షన్లు ఇంకా పడలేదు. వాస్తవానికి జనవరి 25వ తేదీన వరకే ఆ నెల పెన్షన్లు జమ కావాల్సి ఉండేది. కానీ ఫిబ్రవరి 3వ తేదీ వచ్చినప్పటికీ.. జనవరి పెన్షన్లు ఇంకా పడలేదు. ఇక దీనిపై సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు చేశారు. పెన్షన్లు ఇవ్వకపోవడమే చేయూతనా అంటూ నిలదీశారు. జనవరి నెల ఆసరా పెన్షన్లు ఇంకెప్పుడిస్తారని ప్రశ్నించారు. 2 వేలకు బదులు 4 వేల రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారని…కానీ ఇప్పుడు కనీసం ఆ 2వేల రూపాయలు కూడా ఇప్పటిదాకా దిక్కులేదని మండిపడ్డారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, అభాగ్యులు ఎదురుచూసే పరిస్థితికీ కాంగ్రెస్ తెచ్చిందంటూ ఆగ్రహించారు.