TS Politics: రిపబ్లిక్ డే సందర్భంగా గ్యాలెంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం

TS Politics: Center announces gallantry awards on the occasion of Republic Day
TS Politics: Center announces gallantry awards on the occasion of Republic Day

గణతంత్ర దినోత్సవం 2024 సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాలెంటరీ అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది విధుల్లో ఉత్తమ సేవలందించిన 1132 మంది అధికారులకు అవార్డులు ప్రకకటించింది. 1,132 మంది పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్‌కు పతకాలను, శౌర్య విభాగంలో 2 ప్రెసిడెంట్స్ మెడల్, గ్యాలెంట్రీ 275 మందికి పతకాలను అందజేయనున్నట్లు తెలిపింది. ఉత్తమ ప్రతిభ కేటగిరీలో ఏపీకి 9 అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు రాష్ట్రానికి 6 గ్యాలెంటరీ, 12 ఉత్తమ ప్రతిభ, 2 రాష్ట్రపతి అవార్డులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది.

తెలంగాణకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి డీఎస్‌ చౌహాన్‌ను ప్రెసిడెంట్స్ మెడల్ అవార్డు వరించింది. అదనపు డీజీ సౌమ్య మిశ్రాకు కూడా ప్రెసిడెంట్స్ మెడల్ అవార్డు దక్కింది. ఇక రాష్ట్రానికి చెందిన ఐదుగురు కానిస్టేబుళ్ల, ఒక ఏఆర్ ఎస్సైకి గ్యాలెంటరీ పతకాలు రాగా.. 12 మంది అధికారులకు విశిష్ట సేవ పతకాలు లభించాయి. ఇద్దరు జైళ్ల శాఖ అధికారులు కూడా విశిష్ట సేవ పథకాలకు ఎంపికయ్యారు. అవార్డులు పొందిన అధికారులంతా తమకు గ్యాలెంటరీ పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.