తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం దక్కింది. ఫిబ్రవరి 18న అమెరికాలోని ప్రఖ్యా త హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే 21వ ఇండియా కాన్ఫరెన్స్లో మాట్లాడేందుకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు మాజీ మంత్రి కేటీఆర్కు ఆహ్వాన పత్రం అందజేశారు.
ఈ కాన్ఫరెన్స్లో విద్యార్థులు, విద్యా వేత్తలు, వ్యాపార ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రవాస భారతీయులు పాల్గొంటారు. ఇదంతా పక్కకు పెడితే, లోకసభ ఎన్నికలకు BRS పార్టీ రెడీ అవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్,పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము నుంచి సుమారు 5 వందల మంది సమావేశంకు హాజరు అయ్యారు.