TS Politics: కేటీఆర్‌కు ఆహ్వానం పంపిన హార్వర్డ్ యూనివర్సిటీ

TS Politics: Harvard University invited KTR
TS Politics: Harvard University invited KTR

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం దక్కింది. ఫిబ్రవరి 18న అమెరికాలోని ప్రఖ్యా త హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే 21వ ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వాన పత్రం అందజేశారు.

ఈ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు, విద్యా వేత్తలు, వ్యాపార ప్రముఖులు, విధాన నిర్ణేతలు, ప్రవాస భారతీయులు పాల్గొంటారు. ఇదంతా పక్కకు పెడితే, లోకసభ ఎన్నికలకు BRS పార్టీ రెడీ అవుతోంది. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్,పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము నుంచి సుమారు 5 వందల మంది సమావేశంకు హాజరు అయ్యారు.