సంక్రాంతి పండుగ నేపథ్యంలో… BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ సందర్భంగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ఇవాళ్టి నుంచి ఈ నెల 16 వరకు BRS పార్టీ విరామం ప్రకటించింది. ఇక మళ్ళీ 17 వ తేదీ నుంచి యథావిధిగా సమావేశాలు సాగుతాయని BRS పార్టీ వెల్లడించింది. కాగా ఈ నెల 16 న జరగాల్సిన నల్గొండ పార్లమెంటు సన్నాహక సమావేశం ఈ నెల 22 న జరుగుతుంది.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు. భవిష్యత్ లో ఉండదన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీ క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కి బీజేపీ బీ టీమ్ అయితే.. ఎమ్మెల్సీ కవితపై కేసు పెట్టేదా..? అని ప్రశ్నించారు.