TS Politics: ఆరు గ్యారంటీల అమలుకు ప్రణాళికలు: డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క

TG Politics: RTC assets will not be sold under any circumstances: Deputy CM
TG Politics: RTC assets will not be sold under any circumstances: Deputy CM

మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చాం. రాష్ట్రంలో సంపద సృష్టించి పేద ప్రజలకు పంచుతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేశాం. రాజీవ్ ఆరోగ్య శ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచాం. పూర్తిస్థాయిలో ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బడ్జెట్ అంచనాల కోసమే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు.