రథసప్తమికి ప్రత్యేక దర్శనాలు రద్దు

TTD Canceled on Ratha Saptami Special Visits

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రథసప్తమి పర్వదినం సందర్భంగా జనవరి 24వ తేదీ బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. 

ఇందులో భాగంగా ఉదయం విఐపి బ్రేక్‌ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు, దాతలకు, మిలటరీ, యన్‌.ఆర్‌.ఐలకు సుపథం మార్గంలో కల్పించబడే ప్రత్యేక దర్శనాలను కూడా టిటిడి రద్దు చేసింది.

సూర్యజయంతిని పురస్కరించుకుని స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగే కారణంగా, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా వ్యవహరిస్తారు.

సమయం వాహనం

ఉ. 5.30 – ఉ. 08.00 సూర్యప్రభ వాహనం 

(సూర్యోదయం ముహూర్తం ఉ. 6.45 గంటలుగా నిర్దేశించడమైనది)

ఉ. 9.00 – ఉ. 10.00 చిన్నశేష వాహనం

ఉ. 11.00 – మ. 12.00 గరుడ వాహనం

మ. 1.00 – మ. 2.00 హనుమంత వాహనం

మ. 2.00 – మ. 3.00 చక్రస్నానం

సా. 4.00 – సా. 5.00 కల్పవృక్ష వాహనం

సా. 6.00 – సా. 7.00 సర్వభూపాల వాహనం

రా. 8.00 – రా. 9.00 చంద్రప్రభ వాహనం 

కాగా ఈ సందర్భంగా  శ్రీవారి ఆలయం లో ఆరోజు నిర్వహించే ఆర్జితసేవలైన సహస్ర కలశాభిషేకం, కల్యాణోత్సం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవ లను టిటిడి రద్దు చేసింది. అయితే సుప్రభాతం, తోమాల మరియు అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు