Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశంలో అమ్మాయిలపై రోజురోజుకూ పెరుగుతున్న అఘాయిత్యాలు సామాన్యులనే కాదు..సెలబ్రిటీలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆడపిల్లను కనాలంటేనే భయంగా ఉందని ప్రముఖ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి అనడమే ఇందుకు ఉదాహరణ. చండీగఢ్ లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన దేశంలో కలకలం సృష్టించిన నేపథ్యంలో దివ్యాంక ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరై ఇంటికి వెళ్తున్న చిన్నారిపై ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. దీనిపై తీవ్రంగా స్పందించారు దివ్యాంక. మనం ఏ స్వతంత్రం గురించి మాట్లాడుకుంటున్నామని, 70 ఏళ్ల స్వాతంత్ర్యం ఆడపిల్లలకు ఇంకా స్వేచ్ఛనివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు అమ్మాయిని కాపాడటంలో భేటీ బచావో కార్యక్రమం ఏమయిందని ఆమె ప్రశ్నించారు. క్రూరమైన నేరాలు చేసేవారిని క్రూరంగా ఎందుకు శిక్షించరన్న ఆమె దేశానికి మహిళలు ముఖ్యం కాదు అనుకునే పార్టీలకు ఓట్లు వేయటాన్ని మహిళలు ఇకపై ఆపేయాలని కోరారు.
రేపిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్న లోకంలో జీవిస్తున్నామా అని ప్రశ్నించిన దివ్యాంక అన్ని పార్టీలు ఇప్పుడు నిద్ర లేవాలని, భద్రత ప్రతి మహిళ హక్కు అని గుర్తించాలని కోరారు. తనకు కుమారుడికి జన్మనివ్వాలని లేదని, కానీ ఈ పరిస్థితులను చూస్తే ఆడపిల్లను కనాలంటే భయం కలుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. స్వర్గం నుంచి నరకానికి నన్ను ఎందుకు తీసుకొచ్చావని నా కుమార్తె అడిగితే ఏం చెప్పను అని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
దివ్యాంక మాటలు మహిళల్లో నెలకొన్న అభద్రతాభావా నికి, భయాందోళనలకు నిదర్శనం. ఆమె ఒక్క టే కాదు…దేశంలో ఎక్కువమంది మహిళలు ఈ పరిస్థితులను చూసి భయపడే ఆడపిల్లలు పుడితే ఆందోళన చెందుతున్నారు. 2012లో నిర్భయ ఘటన, తదనంతర పరిణామాల తర్వాత దేశంలో అత్యాచారాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ దానికి భిన్నంగా జరుగుతోంది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినా…ఇంకా అమలు కాలేదు. నిర్భయ కేసులానే ప్రతి రేపిస్టు పైనా కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు చేయాలని మహిళలు కోరుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: