టీవీ9 బ్యాన్‌.. బన్నీ సినిమాతో మొదలు

tv9 ban starts with naa peru surya

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

గత కొన్ని రోజులుగా పలు న్యూస్‌ ఛానెల్స్‌ను బ్యాన్‌ చేయాలంటూ మెగా ఫ్యామిలీ డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా టీవీ9, టవీ5, మహాటీవీ ఛానెల్స్‌ను బ్యాన్‌ చేయాలని ఆమద్య మెగా ఫ్యామిలీకి చెందిన కొందరు డిమాండ్‌ చేశారు. ఇటీవలే చిరంజీవి హీరోల సమావేశంలలో న్యూస్‌ ఛానెల్స్‌లో పబ్లిసిటీ అనేది పూర్తిగా మానేయాలని, కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌కు మాత్రమే సినిమా కార్యక్రమాలు ఇవ్వాలంటూ ప్రపోజల్‌ పెట్టాడు. అయితే ఇప్పటి వరకు ఆ విషయమై తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. అయితే మెగా ఫ్యామిలీ ఈలోపు టీవీ9పై అనధికారిక బ్యాన్‌ విధించినట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం రైట్స్‌ను టీవీ9కు ఇవ్వాల్సి ఉన్నా కూడా దాన్ని రద్దు చేసుకుని కేవలం ఎన్‌ టీవీలో మాత్రమే ఆ కార్యక్రమంను ప్రసారం చేయాలని నిర్ణయించారు. టీవీ9కు ఇకపై మెగా హీరోలకు సంబంధించిన ఏ సినిమా కార్యక్రమం ఇవ్వ కూడదనే నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతుంది. కేవలం ప్రీ రిలీజ్‌ వేడుక వరకేనా లేదా యాడ్స్‌ను కూడా టీవీ 9లో వేయరా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు ఇలా తమపై కక్ష సాధిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీవీ9 యాజమాన్యం అనధికారికంగా మెగా ఫ్యామిలీని హెచ్చరిస్తుంది. పవన్‌ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా ఒక వార్తను ప్రసారం చేసినందుకు నిరసనగానే అల్లు అర్జున్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.