టీవీఎస్‌ మోటార్స్‌ గణనీయ లాభాలు

టీవీఎస్‌ మోటార్స్‌ గణనీయ లాభాలు

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం టీవీఎస్‌ మోటర్స్‌ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అదరగొట్టింది. క్యూ2లో సుమారు రూ. 5,619 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.4605 ​​కోట్లను సొంతం చేసుకోగా… గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెండో త్రైమాసికంలో 22 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.

క్యూ2లో రూ.277.60 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది రూ. 196.3 కోట్ల నికర లాభాలను సాధించింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, అంతర్జాతీయంగా నెలకొన్న కంటైనర్లు, సెమీకండక్టర్ల కొరత ఉన్న‍ప్పటికీ టీవీఎస్‌ మోటార్స్‌ గణనీయంగా లాభాలను పొందింది. పన్ను ముందు లాభాలు సుమారు 41 శాతం పెరిగి రూ.377 కోట్లకు చేరుకుంది

అదే సంవత్సరం క్రితం ఇదే త్రైమాసికంలో ₹ 267 కోట్లును టీవీఎస్‌ మోటార్స్‌ ఆర్జించింది.జూలై నుంచి సెప్టెంబర్ 2021 కాలంలో..సుమారు 8.70 లక్షల ద్విచక్ర వాహనాల అమ్మకాలను టీవీఎస్‌ జరిపింది. బజాజ్‌ ఆటో తర్వాత భారత నుంచి ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసే రెండో అతిపెద్ద కంపెనీగా టీవీఎస్‌ మోటార్స్‌ నిలుస్తోంది.