బిగ్ బాస్ చివరి వారంలోనూ హౌస్ మేట్స్ ని వదలడం లేదు. నిన్నటి వరకు ఎమోషనల్ జర్నీ చూపించి ఏడిపించిన బిగ్ బాస్. తాజాగా హౌస్ మేట్స్ మధ్య ఒక చిన్న చిచ్చు పెట్టాడు. ఇప్పటివరకు ఓవరాల్ పెర్ఫామెన్స్ బట్టి 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో కారణాలు చెప్పాలి అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే మిగిలిన వాళ్ళకు కూడా టైమ్ కార్డ్ ఇచ్చి వాళ్ళు ఎందుకు ఆ టైం కు అర్హులో చెప్పాలి అని అన్నాడు బిగ్ బాస్. ముందుగా అర్జున్ ఈ టాస్క్ ని మొదలు పెట్టాడు. అర్జున్ తన మేడలో 10 బోర్డు ధరించి.. నేను ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువ కనిపించకపోయినా టాస్క్ ల్లో బాగానే కనిపించా.. కాబట్టి పది నిముషాలు అనుకుంటున్నా అని అన్నాడు. ఆతర్వాత అమర్ మేడలో 20 బోర్డు వేశాడు. ఆతర్వాత శివాజీ మేడలో 15 బోర్డు,ప్రియాంకకి 7, యావర్‌కి 5, ప్రశాంత్‌కి 3 బోర్డులు ఇచ్చాడు అర్జున్.
ఆతర్వాత అమర్ దీప్ తన మేడలో 15 బోర్డు వేసుకున్నాడు. అలాగే అర్జున్‌కి 3, ప్రియాంకకి 7, యావర్‌కి 5, ప్రశాంత్‌కి 10, శివాజీకి 20 ఇచ్చాడు అమర్. ఎందుకు 5 నిమిషాలే ఇచ్చావని యావర్ ప్రశ్నించించాడు.. దాని అమర్ 2 మినిట్స్ జిమ్, 2 మినిట్స్ గేమ్, 1 మినిట్ ఎంటర్టైన్మెంట్ అని అంటూ సమాధానం చెప్పాడు. అటు ప్రియాంక కూడా తనకు 7 ఇచ్చినందుకు హర్ట్ అయ్యింది.
ఆతర్వాత శివాజీ తన మేడలో 5 బోర్డు వేసుకున్నాడు. అలాగే అమర్ మేడలో 3 నిమిషాల బోర్డు వేసి నువ్వు ఈ 2 వారాలు కాకుండా ముందు ఏం చేసినా నా దృష్టిలో ఏం చేయలేదనే ఫీలింగ్ ఉంది. నువ్ బాగా ఆడగలవు కానీ ఆడలేదు. అని అన్నాడు. దానికి అమర్ మరీ మూడు తీసుకోలేకపోతున్నా అన్న అని అన్నాడు అమర్. ఎందుకు వీడి దగ్గర ఇంత టాలెంట్ ఉండి.. ఏం రోగం వచ్చింది వీడికి.. సరిగా ఆడటానికి అని నేను అనుకునేవాడిని. కొన్ని సార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం వెళ్లినట్లు అనిపించింది అని శివాజీ అన్నాడు. ఇక 10 నిమిషాలు ప్రియాంకకి, అర్జున్‌కి 7 ఇచ్చి. 15, 20 బోర్జులు ప్రశాంత్, యావర్ చేతిలో పెట్టేసి మీకు నచ్చింది తీసుకోండి అని అన్నాడు.