శిఖానే ప్లాన్ చేసిందన్న జయరాం భార్య…నిజమెంత ?

Twists In Chigurupati Jayaram Murder Case

జయరామ్ హత్యకు ఆయన మేనకోడలుTwists In Chigurupati Jayaram Murder Case శిఖా చౌదరే ప్లాన్ చేసిందని ఆయన భార్య పద్మ శ్రీ ఆరోపిస్తున్నారు. తమ ఆస్తుల కోసమే ప్రియుడితో కలిసి శిఖా చౌదరి తన భర్తను హత్య చేసి ఉండొచ్చని ఆమె అంటూన్నారు. అలాంటి అమ్మాయిని ఎక్కడా చూడలేదని శిఖా వ్యవహారం చూశాక, ఆమె నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని ఐదేళ్ల క్రితమే భయపడ్డానని పద్మ శ్రీ తెలిపారు. శిఖా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిందని, డబ్బు కోసం ఆమె ఎంతకైనా తెగిస్తుందని అలాంటి అమ్మాయి తమ ఇంట్లో ఉండటం దురదృష్టకరమని ఆమె అంటున్నారు. తన భర్త హత్య గురించి తెలిశాక శిఖా చౌదరి నందిగామ వెళ్లకుండా తమ ఇంటికొచ్చి కీలక పత్రాలు, విలువైన వస్తువులు తీసుకెళ్లడాన్ని గుర్తించిన ఆమె ఈ విషయమై ఇప్పటికే ఆమె జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్‌ రెడ్డి ఎవరో తనకు తెలియదన్న పద్మ శ్రీ జయరాంకి అతడు నాలుగున్నర కోట్ల రూపాయలు ఇచ్చారనడం వాస్తవం కాదని ఎందుకంటే శిఖా చౌదరికే చెక్‌ పవర్‌ ఉందని శిఖాకు ఎవరు సహకరిస్తున్నారో తెలంగాణ పోలీసులు తేల్చాలని ఆమె కోరారు. శిఖా చౌదరి అమాయకురాలని దేవుడు వచ్చి చెప్పినా తాను నమ్మలేనని జయరామ్‌ భార్య పద్మశ్రీ చెప్పారు. నా భర్త మంచోడని ఆమె చెప్పారు. తన భర్త స్త్రీ లోలుడనే ప్రచారం సరికాదని అన్నారు. జయరామ్‌‌కు, నాకు విబేధాలు ఉంటే 30 ఏళ్లుగా ఎలా కలిసి ఉంటామని పద్మ శ్రీ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటె మరోపక్క శిఖా చౌదరి తన వర్షన్ వినిపిస్తోంది. మామయ్య హత్యలో తన ప్రమేయం లేదని, లుగు రోజుల నుంచి తనను టార్గెట్ చేస్తూ ఎందుకలా ప్రచారం చేశారో అర్థం కావడం లేదని మావయ్యను చంపేశారనే షాక్‌లో ఉన్న సమయంలో ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి రావడం బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 29న అమెరికా నుంచి వచ్చిన మామయ్య, మధ్యాహ్నం మా ఇంటికొచ్చి భోజనం చేశారని తెలిపారు. ఆ తర్వాత తాను సొంతంగా చేపడుతున్న ఒక ప్రాజెక్ట్‌ గురించి చర్చించారని, దీనికి సంబంధించి అమెరికా క్లయింట్‌ ఒకరిని గతంలో పరిచయం చేశారని ఆ క్లయింట్‌తో మాట్లాడిన తర్వాత రాత్రి 8 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయారని తెలిపింది. అంతే కాదు తన ప్రాజెక్టు గురించి పరిశీలించడానికి దీనికి సంబంధించిన ఫైల్‌ను సైతం మావయ్య తనతో తీసుకెళ్లారన్నారు. జనవరి 30న మావయ్యకు ఆ క్లయింట్ ఫోన్‌ చేయడంతో ఆ విషయాల గురించి మెయిల్‌ చేశారని అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఫోన్‌ చేసి తనకు రూ.కోటి కావాలని అడిగారని, మళ్లీ 31న ఉదయం 10.30 గంటలకు ఫోన్‌ చేసి మరోసారి గుర్తుచేశారని అన్నారు. ఇప్పుడ అంత డబ్బు అవసరం ఎందుకని అడిగితే, ఒకరి దగ్గరి రూ.4 కోట్లు తీసుకున్నానని చెప్పి, దీని గురించి వివరాలు అడిగేలోపే కాల్‌ కట్‌ చేశారన్నారు. ఏం జరిగిందని మెసేజ్ చేస్తే, ఒకరి దగ్గర డబ్బు తీసుకున్నానని, ఇప్పుడు ఒత్తిడి చేస్తున్నాడని సమాధానం ఇచ్చారని, ఎవరని అడిగితే నీకు గతంలో బాగా తెలిసిన వ్యక్తి అని మాత్రమే చెప్పాడని తెలిపింది. ఎక్కడున్నావంటే సమాధానం రాలేదని, తర్వాత రోజూ ఉదయం అమ్మ ఫోన్‌ చేసి మావయ్య ప్రమాదంలో చనిపోయాడని చెప్పిందని శిఖా వివరించింది. విజయవాడలో పని ఉందని మావయ్య చెప్పారని, అక్కడికి వెళుతుంటే ప్రమాదం జరిగిందేమో అనుకున్నానని ఆమె వెల్లడించారు. పోస్ట్‌మార్టం చేసేవరకు ఎవరినీ చూడనివ్వలేదని, అయిపోగానే హైదరాబాద్‌ తీసుకొస్తామని అమ్మ చెప్పడంతో ఇక్కడే ఉండిపోయానని అన్నారు.

అంతేకాదు మామయ్య తీసుకెళ్లిన తన ప్రాజెక్టు ఫైల్‌ను తీసుకోవడానికే వాళ్లింటికి వెళ్లానని, అది తప్ప మరే కాగితాలు అక్కడి నుంచి తేలేదని స్పష్టం చేసింది. వాచ్‌మెన్‌ కూడా తనతోపాటు ఇంట్లోకి వచ్చాడని, ఆయన కూడా అదే విషయం చెప్పారన్నారు. జగ్గయ్యపేటలో ఉన్న భూమి పత్రాలు తీసుకోవడానికి వెళ్లాననడంలో నిజం లేదని, హత్యతో నాకు ప్రమేయం ఉంటే అందరికి తెలిసేలా ఆయన ఇంటికి వెళ్లను కదా? అని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. టెట్రాన్‌ కంపెనీలో కార్మికులతో సమస్య వచ్చినప్పుడు తాను పరిష్కరిస్తానని రాకేష్‌రెడ్డి వచ్చాడని, అలా 2017లో అతడితో పరిచయం ఏర్పడిందని కానీ అప్పటికి మావయ్యకు అతను తెలియదని, నాతో రాకేష్‌రెడ్డి తరచూ మాట్లాడేవాడని అతడి ప్రవర్తన నచ్చక 9 నెలల నుంచి దూరం పెట్టానని, మావయ్య కలిసినప్పుడు కూడా దీని గురించి చెప్పి రాకేశ్ నెంబరు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టమని సలహా ఇచ్చానని శిఖా తెలియజేసింది. మావయ్య రూ.4 కోట్లు తీసుకున్నది రాకేష్‌ దగ్గరే అని ఆయన చనిపోయాకే తెలిసిందని ఆమె చెబుతోంది. తీసుకున్నడబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతోనే చంపాడని భావిస్తున్నానని ఆమె చెబుతోంది.