ప్రతిష్టాత్మక సంస్థ యూనిర్సిటీ గ్రాంట్ కమిషన్ ఖాతా హ్యాక్ అయ్యింది. ట్విట్టర్లో యూజీసీకి చెందిన అధికారిక ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. యూజీసీ ట్విట్టర్ ఖాతాకు సంబంధించి డీపీ, కవర్ ఫోటోలను మార్చివేశారు. అజూకీ క్యారెక్టర్లతో డీపీ, కవర్ ఫోటోలను కొత్తగా లోడ్ చేశారు.
యూజీసీ ట్విట్టర్ అకౌంట్‌కి 2,96,000ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2022 ఏప్రిల్ 10న యూజీసీ ఖాతాలో వచ్చిన మార్పులు డీపీ చేంజ్ కావడం చూసిన వారు వెంటనే అప్రమత్తమయ్యారు, హ్యాకింగ్ గురించి రిపోర్టు చేశారు. సాయంత్రానికి ట్విటర్ ఖాతాను యూజీసీ రిస్టోర్ చేసుకోగలింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నాన్ ఫంజిబుల్ టోకెన్లు లుగా అజూకీ క్యారెక్టర్లు ఉన్నాయి. యూజీసీ ట్విట్టర్ ఖాతాను వశం చుసుకున్న హ్యాకర్లు ఈ ఖాతా ద్వారా అజూకీ ఎన్ఎఫ్టీలు అమ్ముతామంటూ ప్రకటించారు.