“‘గేమ్ ఛేంజర్’ పై రెండు గుడ్ న్యూస్, ఒక షాకింగ్ అప్‌డేట్!”

"Two good news, one shocking update on a 'game changer'!"
"Two good news, one shocking update on a 'game changer'!"

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలీ హీరోయిన్స్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “గేమ్ ఛేంజర్” కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ను ఇస్తున్న తరుణంలో ఈ దసరా కానుకగా అయితే టీజర్ ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు.

కానీ ఇప్పుడు బ్యాడ్ న్యూస్ ఏమిటంటే “గేమ్ ఛేంజర్” టీజర్ మాత్రం ఇప్పుడు రావడం లేదని సంగీత దర్శకుడు థమన్ క్లారిటీ కూడా ఇచ్చేసారు . టీజర్ దసరా రావట్లేదని డిజప్పాయింట్ కాకండి టీజర్ కు ఇంకా సిజి వర్క్స్ డబ్బింగ్, ఫైనల్ ఎడిటింగ్ ఇంకా అవుతున్నాయి అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ స్టార్ట్ చేసానని తాను తెలిపారు .

 

"Two good news, one shocking update on a 'game changer'!"
“Two good news, one shocking update on a ‘game changer’!”

దీనితో చరణ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒకింత బాగా డిజప్పాయింట్ కూడా అయ్యారు. ప్రస్తుతం ఉన్న పెద్ద మూవీ ల్లో ఇంకా ఎలాంటి టీజర్ లేకుండా ఉన్న మూవీ గేమ్ ఛేంజర్ ఒకటే అని చెప్పొచ్చు. అందుకే వారు నిరాశలో ఉన్నారు కానీ థమన్ మరో రెండు గుడ్ న్యూస్ లు కూడా దీనితో అందించాడు. మూవీ లో 3వ సాంగ్ ను మొదటిగా నవంబర్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపాడు.

కానీ ఇప్పుడు దీనిని ఈ అక్టోబర్ 30నే విడుదల చేస్తున్నట్టు డేట్ కూడా అనౌన్స్ చేసేసాడు. ఇక దీనితో పాటుగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వాయిదా పడుతుంది అని కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి తాను మళ్ళీ డిసెంబర్ 20 లేదా క్రిస్మస్ కానుకగా గేమ్ ఛేంజర్ రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు . సో ఇలా రెండు గుడ్ న్యూస్ లు ఒక బ్యాడ్ న్యూస్ అయితే మెగా అభిమానులకు ఇప్పుడు వచ్చింది అని చెప్పాలి.