ఒక్క పాట కోసం రెండు మెగా సినిమా లు పెండింగ్ …. !

Two mega movies pending for one song....!
Two mega movies pending for one song....!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మెగా మూవీల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ మూవీ ను దర్శకుడు వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి సోషియో ఫాంటెసీ సినిమా గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌కు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చికన్‌గున్యతో బాధపడుతుండటంతో ఈ బ్రేక్ ని ఇచ్చారు. ఇక ఈ మూవీ లోని ఒక ఐటెం సాంగ్‌ని సెప్టెంబర్ నెలాఖరుకి చిత్రీకరించాలని చిత్ర యూనిట్ భావించింది. చిరంజీవి కోలుకుని సెట్స్‌కు రాగానే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుపుతారని తెలుస్తుంది .

Two mega movies pending for one song....!
Two mega movies pending for one song….!

అటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా ‘పుష్ప-2’ కూడా ఇప్పటికే చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ లోనూ ఒక ఐటెం సాంగ్ షూట్ బ్యాలెన్స్ ఉన్నది . ఈ పాటలో డ్యాన్స్ చేయడానికి శ్రీలీల, త్రిప్తి దిమ్రిల పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారంట . ఈ పాట షూట్‌ని అక్టోబర్ చివరినాటికి పూర్తి చేయాలని సుకుమార్ అండ్ టీమ్ నిర్ణయించుకున్నారంట . దీంతో ఒక్క ఐటెం సాంగ్ కోసం ఈ రెండు మెగా మూవీ లు కూడా పెండింగ్‌లో పడటంతో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది.