తెలంగాణలో మరో రెండు భారీ సంస్థలు

తెలంగాణలో మరో రెండు భారీ సంస్థలు

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి. దీనికి సంబంధించి ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆయా సంస్థల ప్రతినిధులు మంగళవారం కలిశారు. లారస్‌ ల్యాబ్స్‌, గ్రాన్యూల్స్‌ ఇండియా కంపెనీల ప్రతినిధులు కేటీఆర్‌ను కలిశారు. సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు పెడతామని రెండు కంపెనీల ప్రతినిధులు ప్రకటించారు. తమ మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్ల కోసం గ్రాన్యూల్స్‌ ఇండియా రూ.400 కోట్లు, లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి.

‘‘రూ.400 కోట్లతో తయారీ పరిశ్రమను గ్రాన్యూల్స్‌ ఇండియా తయారీ రంగంలోనే లారస్‌ ల్యాబ్స్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి’’ అని కేటీఆర్ మంగళవారం వివరించారు. కంపెనీలను నెలకొల్పడం ద్వారా 1,750 మందికి ఉపాధి కలిస్తామని వివరించారు. పరిశ్రమల స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని వివరించారు.