సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకువీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది.
దీంతో షాక్‌కి గురైన మేకర్స్ రంగంలోకి దిగారు. పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్లైన్ లీక్ నేపథ్యంలో నేడు అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు.