హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌లోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు..

వివరాల్లోకి వెళ్తే.. తార్నాక చౌరస్తాలో ఓ ద్విచక్ర వాహనాన్ని జీహెచ్ఎంసీ లారీ అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే సంఘటన స్థలంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతుడు జీహెచ్ఎంసీ కార్మికుడిగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు..