ఫిలిప్పీన్స్‌ను గురు, శుక్రవారాల్లో అతలాకుతలం చేసిన రాయ్ తుపాను తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరింది. గంటకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ప్రభావం 7.80 లక్షల మంది ప్రజలపై పడిందని ప్రభుత్వం తెలిపింది. లక్షలాది మందికి నిలువ నీడలేకుండా చేసిందని తెలిపింది. సుమారు 3 లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.
పలు ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వివిధ ఘటనల కారణంగా ఇప్పటి వరకు 146 మంది చనిపోయినట్లు సమాచారం. తుపాను తీవ్ర ప్రభావం చూపిన ఒక్క బొహోల్ ప్రావిన్స్‌లోనే 72 మంది చనిపోగా, మరో 10 మంది జాడ తెలియడం లేదని గవర్నర్ ఆర్థర్ చెప్పారు.