సీఎం ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ఎలా ?

u p check given by cm yogi aditynath has bounce bank charged fine from topper student

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్న చందాన స్వయానా సీఎం బహుమతిని చెక్ రూపంలో ఇస్తే అది బౌన్స్ అయ్యింది. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. స్వయానా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యి ఇప్పుడు ఆయన సర్కార్ ని నవ్వుల పాలు చేస్తుంది. ముఖ్యమంత్రి చేతలు మీదుగా లక్ష రూపాయిల నజరానా పొందిన విద్యార్థికి ఆ చెక్ బౌన్స్ అవడంతో నోట మాట రాని విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో పదో తరగతి బోర్డు పరీక్షలో అలోక్ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంక్ సాధించాడు. దీంతో.. అతనికి ముఖ్యమంత్రి యోగి లక్ష రూపాయిల క్యాష్ అవార్డును చెక్ రూపంలో ఇచ్చారు. తనకు ఇచ్చిన చెక్ తీసుకొని బ్యాంక్ కు వెళ్లాడా విద్యార్థి.

అయితే.. బ్యాంక్ కు వెళ్లిన విద్యార్థిని ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌన్స్ అయ్యిందని..జరిమానా కట్టాలని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు అలోక్‌. చెక్‌లో సంతకాలు సరిపోలలేదని అందుకే తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అలోక్‌ పెనాల్టీ చెల్లించాల్సివచ్చింది. ఈ ఉదంతంపై స్పందించిన డీఐఓఎస్ విద్యార్థికి మరో కొత్త చెక్కు ఇచ్చినట్లు వెల్లడించారు. చెక్ మీదున్న సంతకం తేడాగా ఉండటంతో దాన్ని రిటర్న్ చేసినట్లుగా చెప్పిన అధికారులు.. విద్యార్థి చేత ఫైన్ కట్టించారు. బహుమానం కాస్తా అవమానంగా మారటంతో విద్యార్థితో సహా అతడి కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. ఈ ఉదంతంపై స్పందించిన డీఐఓఎస్ విద్యార్థికి మరో కొత్త చెక్కు ఇచ్చారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చే చెక్ విషయంలోనూ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన మీద సోషల్ మీడియాలో కొందరు యోగి సర్కార్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. అసలు సంతకాలు పెట్టడం రాణి వారిని ఎలా సీఎంని చేశారు అని ప్రశ్నిస్తూడగా మరికొందరు ఏమో కొన్ని సార్లు పొరపాటులు సహజమని కామెంట్ చేస్తున్నారు.