సుమారు 23 ఏళ్లు పాటు ఇండస్ట్రీతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్న కమెడియన్ వేణు మాధవ్ మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం నాడు వేణు మాధవ్ ఆకస్మిక మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్లో ఉంచారు.
నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉంటే వేణు మాధవ్.. భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరౌతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను కన్నీరు మున్నీరైంది.
ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. అని చాలా కాలంగా చెప్తునే ఉన్నాం. కాని ఇలా మనల్ని వదిలిపోవడం చాలా బాధాకరం. మా కుటుంబానికి వేణు అన్న మరణం తీరని లోటు. వేణు లాంటి ఆర్టిస్ట్ మళ్లీ పుట్టరు అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు ఉదయభాను.