కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన మేనకోడళ్లపై కామవాంఛతో రగిలిపోయాడో మామ. వారిని బెదిరించి తన లైంగిక కోరికలు తీర్చుకుంటూ పైశాచికానందం పొందుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న కవల అక్కాచెల్లెళ్లకు 12ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. అప్పటి నుంచి మేనమామ మల్‌రెడ్డి కృష్ణారెడ్డి వారిని చేరదీసి పోషిస్తున్నాడు.
అయితే మేనకోడళ్లపై చాలాకాలంగా అతడు లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో వారు మౌనంగానే ఆ బాధ భరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల అక్కాచెల్లెళ్లు ధైర్యం చేసి మేనమామకు ఎదురుతిరిగారు. దీంతో వారిపై చేయి చేసుకున్న కృష్ణారెడ్డి.. ఈ విషయం బయటకు చెబితే ఆస్తి రాకుండా చేయడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితులు గురువారం కొత్తగూడెం ఎస్పీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ మేనమామ నుంచి రక్షణ కల్పించాలని కోరారు. వారి పరిస్థితి చూసి చలించిపోయిన ఎస్పీ.. కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.